బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన తొలి సినిమా 'అల్లుడు శీను' కోసం అప్పటికే నెంబర్ వన్ రేంజ్లో ఉన్న సమంత హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమాలో నటించినందుకు సమంతకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. అలాగే అదే సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తమన్నా కూడా ఆ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంది. తొలి సినిమాకే స్టార్ హీరోయిన్లతో చిందేశాడు బెల్లంకొండ బుల్లోడు. తర్వాతి సినిమా కోసం కూడా స్టార్ హీరోయిన్నే ఎంచుకున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్‌ని. బోయపాటి శీను దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ప్రస్తుతం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలోనే ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ బెల్లంకొండతో ఆడి పాడనుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ స్పీడున్నోడు మరో సినిమాని లైన్లో పెట్టేశాడు. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? 'ముకుందా' సినిమాతో ఎంట్రీతోనే హిట్ కొట్టిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోస్‌కి మెయిన్ ఆప్షన్‌గా మారింది. అల్లు అర్జున్ - హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాలో నటిస్తోంది. కాగా బెల్లంకొండ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు ఈ ముద్దుగుమ్మ కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఏమో చిత్ర యూనిట్ ఇచ్చినా ఇవ్వచ్చు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి అయినా సరే స్టార్ హీరోయిన్స్‌నే తన సినిమాలో హీరోయిన్గా ఎంచుకోవడం బెల్లంకొండ శ్రీనివాస్ స్పెషాలిటీ.