ప్ర‌భాస్ కోసం... ప్రేమ పావురం

By Gowthami - January 23, 2020 - 09:42 AM IST

మరిన్ని వార్తలు

ప్రేమ పావురాలు సినిమా గుర్తుంది క‌దా? అయితే అందులో పాట‌ల్ని ఎవ‌రూ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అనువాద సినిమాగా వ‌చ్చినా.. సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన భాగ్య‌శ్రీ కూడా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆమె వెండి తెర‌పై క‌నిపించ‌బోతోంది. ప్ర‌భాస్ కొత్త సినిమాలో భాగ్య‌శ్రీ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

 

ప్ర‌భాస్ - రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి జాన్ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ త‌ల్లిగా భాగ్య‌శ్రీ న‌టిస్తున్నారు. సంక్రాంతి త‌ర‌వాత హైద‌రాబాద్‌లో జాన్ కొత్త షెడ్యూలు మొద‌లైంది. ఈ షెడ్యూలులోనే భాగ్య‌శ్రీ‌పై కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. బుధ‌వారంతో ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింద‌ని స‌మాచారం. ప్ర‌భాస్ - భాగ్య‌శ్రీ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటాయ‌ని, ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని విశ్వ‌స‌నీయ వర్గాలు చెబుతున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2021 వేస‌విలో విడుద‌ల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS