వర్మ స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న 'భైరవగీత' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి వుంది. కానీ కుదరలేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ '2.0'కి పోటీగా 'భైరవగీత'ను విడుదల చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. పేద్ద సినిమా, చిన్న సినిమా అంటూ పోలికలు కూడా పెట్టారు. మా చిన్న సినిమాకే మీ ఓటు అంటూ పోలింగ్ కూడా పెట్టేశారు. అయితే ఎందుకో అనూహ్యంగా వర్మ రేస్ నుండి తప్పుకున్నారు. పెద్ద సినిమా '2.0' విడుదలైంది. విజయం సాధించింది.
ఇకపోతే 'భైరవగీత' విషయానికి వస్తే, తెలుగులో మాత్రమే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మిగిలిన భాషల్లో ఆల్రెడీ విడుదలైన 'భైరవగీత'ను తెలుగులో ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వర్మ తాజాగా ప్రకటించారు. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సిద్దార్ద్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
ఆల్రెడీ ప్రచార చిత్రాలు గుడ్ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు, రిలీజ్ డేట్ వాయిదా పడడంతో పాతబడి పోయాయి కూడా. ఈ వారం సినిమా విడుదల ప్రకటించడంతో కొత్తగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుందట చిత్ర యూనిట్. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడంతో 'భైరవగీత' జోరు చూపించడం ఖాయమే అనిపిస్తోంది. ముఖ్యంగా యూత్ ఎట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండడంతో 'భైరవగీత' జోరు ఎలా ఉండబోతుందో చూడాలిక.