కమల్‌ కోసం రూటు మార్చిన శంకర్‌.?

By iQlikMovies - December 05, 2018 - 10:14 AM IST

మరిన్ని వార్తలు

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా చాలాకాలం క్రితం 'భారతీయుడు' సినిమా వచ్చింది. దానికి సీక్వెల్‌ మళ్ళీ ఇన్నాళ్ళకు శంకర్‌ - కమల్‌ కాంబినేషన్‌లోనే సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. ఈ నెల 14 నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం జరిగిపోయింది. తాజాగా, ఈ సినిమా కోసం హీరోయిన్‌ని ఫైనల్‌ చేశారు. అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. అసలు విషయం ఏంటంటే, శంకర్‌ 'భారతీయుడు-2' కోసం కొత్త రూట్‌లో పయనించబోతున్నాడట. ఆ కొత్త రూట్‌లో, శంకర్‌ వేగం పెంచుతాడట.

 

మామూలుగా శంకర్‌, ఏ సినిమా తెరకెక్కించినా టైమ్‌ ఎక్కువ తీసుకుంటాడు. అందుకు భిన్నంగా 'భారతీయుడు-2' సినిమా పరుగులు పెట్టనుంది. చాలా చాలా వేగంగా ఈ సినిమా నిర్మాణం పూర్తవుతుందట. ఇప్పటికే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కమల్‌హాసన్‌, 'భారతీయుడు-2'ని తన ఆఖరి సినిమాగా ప్రకటించేశాడు. ఎన్నికలకు సమాయత్తమవ్వాల్సి వుంటుంది గనుక, శంకర్‌ సినిమాకి కమల్‌ మరీ అంత ఎక్కువ టైమ్‌ కేటాయించలేడు. ఈ నేపథ్యంలోనే అన్నీ పక్కాగా ప్లాన్‌ చేసుకుని, సినిమాని సెట్స్‌ మీదకు తీసుకువెళుతున్నారు.

 

శంకర్‌ ఎలాగైతే, ఏ విషయంలోనూ రాజీ పడడో కమల్‌హాసన్‌ కూడా అంతే. మంచి ప్లానింగ్‌తో మాత్రమే తమ కాంబినేషన్‌లో సినిమా వేగంగా పూర్తవగలదని శంకర్‌, కమల్‌ ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రాఫిక్స్‌ వగైరాలు ఎక్కువ టైమ్‌ తీసుకునే అవకాశం వున్నందున ఓ వైపు సినిమా షూటింగ్‌, ఇంకో వైపు ఆ పనులు సైమల్టేనియస్‌గా జరిగిపోతాయట. శంకర్‌ నుంచి, అలాగే కమల్‌హాసన్‌ నుంచి ఓ సినిమా వేగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటే.. కాదనేవారెవరు.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS