భీమ్లా నాయ‌క్ వ‌చ్చేశాడు

By iQlikMovies - August 15, 2021 - 10:33 AM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా క‌థానాయ‌కులుగా ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`కి ఇది రీమేక్‌. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. ఈ చిత్రానికి `భీమ్లా నాయ‌క్‌` అనే పేరు ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో ప‌వ‌న్ పాత్ర పేరు భీమ్లా నాయ‌క్ అని ఎప్పుడైతే చెప్పారో, అప్పుడే ఈ సినిమా పేరు భీమ్లా నాయిక్ అని ఫిక్స‌యిపోయారు అభిమానులు. ఇప్పుడు అదే నిజ‌మైంది.

 

ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లింబ్స్ విడుద‌ల చేశారు. ప‌వ‌న్ ని హైలెట్ చేస్తూ రూపొందించిన చిన్నపాటి టీజ‌ర్ ఇది. `భీమ్లా.. భీమ్లా నాయ‌క్‌.. ఏంటి చూస్తున్నావ్‌.. క్యాప్ష‌న్ లేద‌నా.. అక్క‌ర్లెద్దు... బండెక్కు` అంటూ సాగే ప‌వ‌న్ డైలాగ్ ఈ టీజ‌ర్ లో వినిపిస్తుంది. జ‌న‌వ‌రి 12న ఈ సినిమాని విడుద‌ల చేయ‌బోతున్నారు. సెప్టెంబ‌రు 2.. ప‌వ‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలోని తొలి గీతాన్ని బ‌య‌ట‌కు వ‌దులుతారు. ఈ టీజ‌ర్ అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసేలా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS