'బిగ్‌బాస్‌'కున్న క్రేజ్‌ అలాంటిది.. పార్టిసిపెంట్స్ లిస్ట్ లీక్..!

మరిన్ని వార్తలు

గతేడాది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమైన మెగా గేమ్‌ షో 'బిగ్‌బాస్‌'కి వచ్చిన రెస్పాన్స్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతవరకూ ఉన్న టీఆర్‌పీ రేటింగ్స్‌ రికార్డుని ఏ స్థాయిలో ఈ గేమ్‌ షో బీట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'బిగ్‌బాస్‌' సీజన్‌ 2 ప్రారంభం కానుంది. 'బిగ్‌బాస్‌ 2' స్టార్ట్‌ అవనుందనే టాక్‌ వచ్చినప్పటి నుండీ, బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిన ఆశక్తికి అంతే లేదు.

ఈ సీజన్‌లో ఎవరెవరు పార్టిసిపెంట్స్‌గా రానున్నారనే విషయంపై అంతా రకరకాల గాసిప్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 'బాబాయ్‌ ఈ సారి ఇంకొంచెం మసాలా..' అంటూ బిగ్‌బాస్‌ 2కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాని ప్రోమో డైలాగ్‌తో ఆడియన్స్‌ ఓ అంచనాకి వచ్చేశారు. ఈ షోలో పార్టిసిపేట్‌ చేయబోయే సెలట్రిటీస్‌ వీరే అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న స్క్రోలింగ్స్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయిపోతున్నారు.

సీనియర్‌ నటి రాశీ, తన డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకునే ధన్య బాలకృష్ణ, అందాల భామ ఛార్మి, గాన కోకిల గీతా మాధురి, ఆర్యన్‌ రాజేష్‌, యూత్‌లో క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌తో పాటు, అప్పట్లో యూత్‌కి క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌ అయిన గజాలా తదితరులు ఈ గేమ్‌షోలో పార్టిసిపేట్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరీ ముఖ్యంగా ఇటీవల 'కాస్టింగ్‌ కౌచ్‌' వివాదంతో వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచిన శ్రీరెడ్డి కూడా బిగ్‌బాస్‌ 2 పార్టిసిపెంట్స్‌లో ఉందనీ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమైన పార్టిసిపెంట్లు ఎవరో తెలియాలంటే జస్ట్‌ టెన్‌ డేస్‌ ఆగాల్సిందే. జూన్‌ 10 నుండి 'బిగ్‌బాస్‌ 2' బుల్లితెరపై సందడి చేయనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS