వెండితెరపై స్టార్ హీరోగా వెలిగిపోతోన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన్ని వెండితెర నుండి బుల్లితెర వైపు నడిచేలా చేసింది ది ఒన్ అండ్ ఓన్లీ 'బిగ్‌బాస్'. విత్ అవుట్ ఎన్టీఆర్ నో 'బిగ్‌బాస్'. ఈ షోకి హోస్ట్ ప్లేస్‌లో ఎన్టీఆర్ పంచిన అనుబంధం, ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్‌లోని డిఫరెంట్ యాంగిల్స్‌ని అత్యంత సన్నిహితంగా ప్రేక్షకులకు చేరవేసిన షో 'బిగ్‌బాస్'. అందుకే ఈ షో పూర్తయిన రోజు తిరిగి వెళుతూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకొంచెం సేపు ఇదే స్టేజ్ మీద ఉంటే ఏడ్చేస్తానేమో అని ఎన్టీఆర్ అనడం అభిమానుల్ని కంట తడి పెట్టించింది. వారానికి రెండు సార్లే కనిపించినప్పటికీ ఆ ప్రభావం వారం మొత్తం ఉండేది. అలాంటి ఎన్టీఆర్ - బిగ్‌బాస్ షో అయిపోయిందంటే అస్సలు జీర్జించుకోలేకపోయారు అభిమానులు. సినిమాల్లో డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తాం. కథలో ఏం రాసుంటే అదే పర్‌ఫామ్ చేస్తాం. కానీ రియాలిటీ షోలో అలా కాదు. మనలో అంతర్లీనంగా దాగున్న కొన్ని ఎమోషన్స్, భిన్న టాలెంట్స్ బయటికి వస్తాయి. అదే జరిగింది ఈ బిగ్‌బాస్ షో ద్వారా అని ఎన్టీఆర్ అన్నారు. నవ్వించారు. కవ్వించారు. మురిపించారు. మేగ్జిమమ్ ఎంటర్‌టైన్ చేశారు. ఎన్టీఆర్ చిలిపి చేష్టలకు బుల్లితెర ప్రేక్షకులు నూటికి నూరు శాతం సంతృప్తి చెందారు. తమ కుటుంబంలో ఒక్కడిగా మారిపోయారు ఎన్టీఆర్ బుల్లితెర ఆడియన్స్‌కి. తమ ఇంటితో పాటు, బిగ్‌బాస్ ఇంటి మీద కూడా ఓ కన్నేసి ఉంచండి అంటూ ఆయన చెప్పే మాట జనానికి బాగా రీచ్ అయిపోయింది. 'ఎందరో మహానుభావులు అందరికీ మీ ఎన్టీఆర్ వందనాలు..' అంటూ చివరి సారిగా ప్రేక్షకుల నుండి అభివాదాలు తీసుకుని 'బిగ్‌బాస్' జర్నీని ఎమోషనల్‌గా, సక్సెస్‌ఫుల్‌గా ముగించేశారు ఎన్టీఆర్.