బిగ్ బాస్ సీజన్‌లో ‘అతి’కి కొదవ లేదు. దాదాపుగా కంటెస్టెంట్స్ అందరూ ఆ ‘అతి’ ప్రదర్శిస్తూనే వున్నారు. ‘కెమెరా ఫేవర్’ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది కంటెస్టెంట్స్‌కి. ఈ విషయాన్ని అమ్మ రాజశేఖర్ పలు సందర్భాల్లో చెప్పాడు, చెబుతూనే వున్నాడు. అయితే, కెమెరా ముందుకొచ్చి ఆయా కంటెస్టెంట్స్ చిన్న చిన్న విషయాల్నీ గొప్పగా, గట్టిగా, సానుభూతికోసం చెబుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ లిస్ట్‌లో అరియానా ‘అతి’ మిగతా అందరికంటే టాప్’ అని అంటున్నారు నెటిజన్లు. ఈ వారం ఎలిమినేషన్‌కి అరియానా కూడా నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె రేషన్ మేనేజర్‌గా ఎంపికైంది. అదీ కెప్టెన్ అవినాష్ చలవతో. ‘విమెన్’ కేటగిరీ.. అంటూ ఓ గ్రూపు తయారీలో అరియానా మొదటి నుంచీ ప్రయత్నిస్తూనే వుంది.
ఈ క్రమంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిపోయింది.. ఆ తర్వాత కూడా అలియానా ‘విమెన్ కేటగిరీ’ నినాదం మానడంలేదు. కెప్టెన్సీ టాస్క్ సమయంలోనూ ‘విమెన్’ కార్డ్ తెరపైకి తెచ్చింది అరియానా. దానికి హారిక సపోర్ట్ ఇచ్చింది. కెప్టెన్సీ టాస్క్‌లో అరియానా ఓడిపోయినా, అవినాష్ ఆమెకు రేషన్ మేనేజర్ పోస్ట్ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. మరోపక్క రేషన్ మేనేజర్‌గా రేషన్ తెచ్చే క్రమంలో, అరియానా ముందు రేషన్ కావాలా? అబిజీత్ దుస్తులు కావాలా? అనే ప్రశ్న వచ్చింది. తొలుత అభిజీత్ దుస్తుల వైపే మొగ్గు చూపి, కంటెస్టెంట్స్ అందర్నీ ఫేస్ చేస్తానని చెప్పిందిగానీ, ఆ తర్వాత రేషన్ వైపే మొగ్గు చూపింది. ఈ డబుల్ స్టాండర్డ్, దాంతోపాటుగా ఆ సమయంలో ఆమె చేసిన అతి, అన్ని విషయాల్లోనూ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్.. ఇవన్నీ కలిపి ఆమెను ‘అతి’లో అందరికంటే ‘అతి’ కంటెస్టెంట్ అంటున్నారిప్పుడు.