బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చోటు చేసుకుంది. ‘టీమ్’ని సీరియస్‌గా తీసుకోమని బిగ్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున చెప్పడంతో, ఎవరికి వారు అత్యుత్సాహం చూపించేస్తున్నారు. ‘దూకుడు’ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం మీద చిత్రీకరించిన ‘రియాల్టీ షో’ కామెడీ ఎపిసోడ్‌ని మించిపోయేలా బిగ్‌బాస్ హౌస్‌లో నాటకీయత కన్పిస్తోంది. హ్యామన్స్, రోబోట్ ఎపిసోడ్ సందర్భంగా హ్యామన్స్ బృందంలోని దివిని, రోబోట్స్ బృందం కిడ్నాప్ చేయడం, ఈ క్రమంలో అభితోపాటు గంగవ్వ పొడిచిన వెన్నుపోటుని తట్టుకోలేకపోతున్న హ్యూమన్స్ బృందం.. ఇదంతా తీవ్ర గందరగోళాన్ని క్రియేట్ చేసింది.
ఇలాంటి టాస్క్‌లు గత సీజన్లలోనూ చూసినా, ఇంత నాటకీయత మాత్రం గతంలో కనిపించలేదు. దాదాపు కంటెస్టెంట్స్ అంతా, కమెడియన్ బ్రహ్మానందంను మించిపోయి యాక్టింగ్ చేసేస్తున్నారు. డైరెక్షన్ మాత్రం పరమ వీక్‌గా కనిపిస్తోంది. ఇదసలు రియాల్టీ షోనే కాదు, ఇది పూర్తిగా ఓ పక్కా డైరెక్షన్‌లో నడుస్తున్న వ్యవహారం.. అని బిగ్ బాస్ వ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారు. ఎవరేమనుకున్న, ఈ వీకెండ్‌లో హౌస్ మేట్స్‌తో ఆడుకోవడానికి కింగ్ నాగ్‌కి ఓ టాపిక్ దొరికిందన్నది నిర్వివాదాంశం.
నోయెల్ సీన్‌కి ఇంకోసారి నాగ్ అసందర్భంగానే పనిష్‌మెంట్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఈ రగడ సాకుగా చూపి ఓ కంటెస్టెంట్‌ని డైరెక్ట్‌గా నామినేట్ చేయడమో, లేదంటే ఎలిమినేట్ చేయడమో కూడా జరగొచ్చట.