'బాడీషేమింగ్'.. ఈ మాట అప్పుడెప్పుడో క్రిటిక్ కత్తి మహేష్ విషయంలో విన్నాం. ఆ టైంలో పలు ఛానెల్స్‌లో ఈ అంశంపై డిబేట్ కార్యక్రమాలు కూడా నిర్వహించేశారు. సరే ఇప్పుడీ టాపిక్‌తో మనకు సంబంధం లేదు కానీ, బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నోటి వెంట తాజాగా ఈ బాడీ షేమింగ్ అనే మాట వినిపిస్తోంది.
సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా తనయ అయిన సోనాక్షీ సిన్హా మొదటి నుండీ కొంచెం బొద్దుగానే కనిపిస్తూ వచ్చింది. క్రమ క్రమంగా బరువు తగ్గించుకుని నాజూగ్గా తయారైంది. అయితే ఇప్పుడెందుకు ఆమె బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతోందంటే, ఇప్పటికీ ఆమెను సోషల్ మీడియాలో ట్రాల్ చేస్తున్నారట కొందరు ఆకతాయిలు. అస్సలేమాత్రం అందంగా ఉండవనీ, హీరోయిన్స్‌కి ఉండాల్సిన నాజూకుతనం లేదనీ ఆమెని ట్రాల్ చేస్తుంటే చాలా బాధగా ఉందని సోనాక్షి వాపోతోంది. నిజానికి అలాంటి ఆకతాయిలు ఇలాంటి మాటల్ని ఎదురుగా అంటే వాళ్ల చెంపలు వాచేలా కొడతానని గుస్సా అవుతోంది సోనాక్షి సిన్హా. చిత్ర పరిశ్రమకు రాకముందు అందరూ లావుగా ఉన్నవాళ్లే. నటనపై ఉన్న ఆశక్తితో ప్యాషన్‌తో తమ బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు పడిన కష్టమేంటో అలా పడిన వారికే తెలుస్తుంది. టాలీవుడ్లో ఇప్పుడు హీరోలుగా చెలామనీ అవుతున్న పలువురు స్టార్స్ కూడా సినిమా కోసం కష్టపడి తమ బరువు తగ్గించుకుని వచ్చినవాళ్లే. అలాంటిది పాపం సోనాక్షికే ఎందుకింత కష్టం.
అయినా ఆమె బరువు ఆమె ఇష్టం. అవకాశాలైతే వస్తున్నాయి కదా. మీకెందుకంత కష్టం (నెటిజన్స్‌కి).. అంతేగా.. అంతేగా..! ప్రస్తుతం సోనాక్షి 'కళంక్' సినిమాలో నటిస్తోంది. అలియాభట్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో భరత్ బ్యూటీ కైరా అద్వానీ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది.