హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్, తాజ్ బంజారా హోటల్స్ లో నిన్న అర్దరాత్రి జరిగిన పోలీస్ రెయిడ్ లో ఇద్దరు హీరోయిన్స్ దొరికిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ నటి రిచా సక్సేనాతో పాటు ముంబైకి చెందిన వ్యభిచార నిర్వాహకుడు మోనిష్ కడాకియా శుక్రవారం నాడు హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హొటల్లో రూమ్స్ బుక్ చేసుకున్నారు. వీరు అంతర్జాలం ద్వారా విటులని ఆకర్షిస్తూ ఈ వ్యాపారం చేస్తున్నాట్టుగా సమాచారం.
ఈ విషయం పైన పక్కా సమాచారంతో సికింద్రాబాద్ పోలీసులు దాడి చేశారు. వీరివురిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక ఇదే సమయంలో తాజ్ బంజారా హోటల్ లో కూడా వ్యభిచారం జరుగుతున్నట్టు తెలిసి అక్కడ రెయిడ్ చేసి బెంగాలీ బుల్లితెర నటి సుబ్ర ఛటర్జీ, విటుడు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు.
ఈ రెండు సంఘటనలు ఒకే రాత్రి జరగడం, పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యభిచార స్కాం పై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది.