బాలయ్య కోసం ఆ బాలీవుడ్‌ నటుడు.?

By Inkmantra - November 08, 2019 - 08:02 AM IST

మరిన్ని వార్తలు

మారిన సినిమా ఈక్వేషన్స్‌ కారణంగా నార్త్‌ జోన్‌, సౌత్‌ జోన్‌ అనే తేడా లేదు. ఇక్కడి వాళ్లు అక్కడా, అక్కడి వాళ్లు ఇక్కడా నటించేందుకు వెనుకాడడం లేదు. ప్యాన్‌ ఇండియన్‌ ప్యాటర్న్‌లో సినీ పరిశ్రమ వెలుగొందుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ నుండి అక్షయ్‌ కుమార్‌, సంజయ్‌ దత్‌ తదితరులు సౌత్‌ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించారు. పోషిస్తున్నారు కూడా. ఇక హీరోయిన్స్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ మూవీస్‌లోనూ నార్త్‌ భామలు తెగ సందడి చేస్తున్నారు. ఆ మాటకొస్తే, మన తెలుగు మూవీస్‌లో ఎక్కువగా నార్త్‌ భామల సందడే ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

ఇప్పుడీ టాపిక్‌ ఎందుకు ముచ్చటించుకోవల్సి వస్తుందంటే, ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ హీరోలు సౌత్‌ కోసం విలన్లుగా మారారని చెప్పుకున్నాం కదా. తాజాగా మన తెలుగు స్టార్‌ హీరో నందమూరి బాలయ్య సినిమా కోసం ఓ బాలీవుడ్‌ నటుడు విలన్‌గా మారబోతున్నాడనే వార్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా బాలీవుడ్‌ నటుడు అంటే, ఆరడుగుల ఆజానుబాహుడు సంజయ్‌దత్‌. ఆల్రెడీ సంజయ్‌దత్‌ కన్నడ మూవీ 'కేజీఎఫ్‌ 2'లో విలన్‌గా నటిస్తున్నాడు. ఒకవేళ బాలయ్య సినిమాలో కూడా నటిస్తే, ఇదే ఆయనకు రెండో తెలుగు సినిమా అవుతుందేమో. అప్పుడెప్పుడో నాగార్జున సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు సంజయ్‌దత్‌. తాజాగా సంజయ్‌దత్‌ పేరు తెరపైకి రావడంతో బాలయ్య సినిమాపై అంచనాలు పెరిగాయి.

 

బోయపాటి శీను - బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రం కోసమే సంజయ్‌దత్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకవేళ సంజయ్‌దత్‌ ఓకే అంటే, బాలయ్యకి ధీటైన విలన్‌గా తెలుగు ప్రేక్షకులు ఆయన్ని గుర్తుంచుకుంటారు. ప్రస్తుతం 2రూలర్‌' సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య, తదుపరి బోయపాటి శీను సినిమాలో నటించనున్నారు. డిశంబర్‌లో 'రూలర్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS