ట్రిపుల్ సెంచరీ కొట్టిన బుట్టబొమ్మ

By Inkmantra - August 03, 2020 - 11:18 AM IST

మరిన్ని వార్తలు

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా 'అల వైకుంఠపురములో' ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమాతో పాటు ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి.  పాటలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ప్రేక్షకాదరణ పొందాయి. ఇక యూట్యూబ్లో వ్యూస్ సంగతి చెప్పనక్కర్లేదు. మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదు చేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.


ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన బుట్ట బొమ్మ పాట తాజాగా 300 మిలియన్ల వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఈ పాటకు 2.2 మిలియన్ల లైక్స్ రావడం కూడా మరో విశేషంగా చెప్పుకోవాలి. ఈ పాట సాధించిన 300 మిలియన్ వ్యూస్ అతి తక్కువ సమయంలో నమోదు చేసినవి కావడం గమనార్హం. ఈ పాట ఊపు చూస్తుంటే వ్యూస్ ఇంతటితో ఆగేలా ఏమాత్రం కనిపించడం లేదు.  400 మిలియన్ల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్టుగా ఉంది. 


ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. బుట్ట బొమ్మ పాట విషయానికి వస్తే రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడగా జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.  అల్లు అర్జున్ పూజా హెగ్డే ఇద్దరూ తమ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో, సూపర్ డాన్స్ తో ప్రేక్షకులు ఈ పాటను మళ్లీ మళ్లీ చూసేలా  చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS