సాయి ధరం తేజ్ జవాన్ చిత్ర దర్శకుడు BVS రవి నిన్న మీడియా ముందుకి వచ్చి తన బాధని కోపాన్ని వెళ్ళగక్కాడు.
అదేంటంటే- జవాన్ సినిమా విడుదల అయిన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్స్ అంతర్జాలంలో ద్వారా బయటకి వచ్చేసాయి అని అలాగే సదరు పైరసీ కాపీలని ట్రావెల్స్ బస్సులో సైతం వేసేస్తునట్టు ఆరోపించాడు.
ప్రభుత్వం ఇప్పటికే పైరసీ కోసం అనేక చట్టాలు తెచ్చినా పైరసీని అడ్డుకోవడంలో విఫలమవుతున్నామని అలాగే ప్రజానీకం కూడా ఇటువంటి పైరసీ భూతాన్ని అరికట్టడానికి కృషి చేయాలని కోరాడు.
సినిమాలని ధియేటర్ కి వచ్చి చూస్తేనే తాము పడ్డ కష్టానికి ఒక విలువ, ప్రోత్సాహం దక్కుతాయి అని విన్నవించాడు.