యూట్యూబ్ కి పోటీగా X

మరిన్ని వార్తలు

ఇప్ప‌టి యువత ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకే పరిమితం అవుతోంది. ఈ ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకునే, సోషల్ మీడియా వేదికలు రక రకాల మార్పులకి నోచుకుంటున్నాయి. ట్విట్టర్ కూడా ఇలానే 'X ' లా రూపాంతరం చెందింది. మొదట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా తరవాత కాలంలో మంచి ప్లాట్ ఫామ్ గా గుర్తింపు పొందింది. ఎలాన్ మస్క్ 'X ' లో సంచలన మార్పులు చేశారు. ఇప్పుడు కూడా మ‌రో ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ తో వ‌చ్చింది. ఇప్పటివరకు' X 'లో  పోస్ట్ చేసే వీడియోలు సెకన్లలో, నిముషాల్లో మాత్రమే ఉండేవి.  కానీ ఇక  నుంచి మొత్తం సినిమా చూసే వెసలుబాటు క‌ల్పిస్తున్నారు. 


ఇక నుంచి 'X ఖాతాదారులు  తమ సినిమాలు, టీవీ సీరియళ్లను X లో పోస్టు చేయొచ్చని,  వాటిని మానిటైజ్ చేసి తద్వారా డబ్బులు కూడా సంపాదించ వచ్చంటూ X తెలిపింది. దాంతో యూజర్స్ కి, క్రియేటర్స్ కి యూట్యూబ్ మాదిరిగా దీన్నికూడా వాడుకునే ఛాన్స్ లభించింది. ఒక రకంగా ఇది  యూట్యూబ్ కు గట్టి పోటీ అని చెప్పొచ్చు. వీడియో స్ట్రీమింగ్, సీరియల్స్ అందుబాటులోకి వస్తే 'X ' మరింత పాపులర్ అవుతుంది. ఆదాయ మార్గం కూడా ఉండ‌డంతో.. ఇప్పుడు యూ ట్యూబ్‌కు దీన్నో ప్ర‌త్యామ్నాయంగా చూస్తారు.    


ఎవరు పోస్ట్ చేస్తే వారు ఎంతో కొంత డబ్బులు కూడా ఫిక్స్ చేసేస్తే ఇక సబ్ స్కైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరికి ఏ సినిమా నచ్చితే అదే కొనుక్కుని చూస్తారు. ఆ ఒక్కదానికి డబ్బులు పే చేస్తే చాలన్నది X ఖాతాదారుల అభిప్రాయం. అంతే కాకుండా యాడ్స్ విషయంలో కూడా కొన్ని ప్రణాళికలు వేస్తున్నట్టు మస్క్ తెలిపారు.  యాడ్స్ టార్గెటెడ్ యూజర్లకు మాత్రం అందేలా చేయటం కోసం సరికొత్త ఏఐ సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా మస్క్ చెబుతున్నారు. యాడ్స్ ఎవరికి చేరాలి, అనే క్లారిటీ ఇస్తే  'ఏఐ' వ్యవస్థ సెకన్ల వ్యవధిలో వారి లిస్ట్ ని ఫైనల్ చేసి  వారికి చేరేలా చేస్తుందని పేర్కొన్నారు.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS