కేథరీన్‌ ఫ్యాన్స్‌ హర్టయ్యారు.. ఎందుకంటే!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని క్షణాలూ పుష్కంగా ఉన్న ముద్దుగుమ్మ కేథరీన్‌. కానీ, ఏం లాభం. ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్‌ దక్కించుకోలేకపోతోంది. గ్యాప్‌ లేకుండా ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. కానీ, కోరుకున్న కల నెరవేర్చుకోవడంలో వెనకే ఉండిపోతోంది. తాజాగా ‘వరల్డ్‌ ఫేమస్‌ వర్‌’ చిత్రంలో కేథరీన్‌ వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నాలుగు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో హీరోలతో లవ్‌లో ఉంటారు. ఐశ్వర్యా రాజేష్‌ విజయ్‌కి భార్యగా ఓ రకమైన ప్రేమను పొందితే, ప్యారిస్‌లో పైలెట్‌గా విజయ్‌తో ఘాటు రొమాన్స్‌ని పండించింది ముద్దుగుమ్మ ఇసాబెల్లె.

 

మరో భామ రాశీఖన్నా పాత్రలకు చాలా ఇంపార్టెన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజ్‌ లవర్‌గా యామినీ పాత్రలో రాశీఖన్నా నటించింది. గాఢమైన లిప్‌లాక్స్‌, ఘాటైన హగ్గింగ్స్‌.. అబ్బో.. చాలానే సీనుంది రాశీఖన్నాకి. ఇక మిగిలిన ముద్దుగుమ్మ కేథరీన్‌.. చూస్తే కార్పొరేట్‌ గాళ్‌లా చాలా రిచ్‌ లుక్స్‌లో కనిపిస్తోంది. కానీ, పాత్రకు ఏ స్థాయి ప్రాధాన్యత ఉందో తెలియడం లేదు. ‘నలుగురితో పాటూ నారాయణ.. గుంపులో గోవిందా..’ అన్నట్లుగా హీరోయిన్స్‌ నలుగురూ పర్‌ఫామెన్స్‌ ఇరగదీసేశారు.. అంటూ చెబుతూ మిగిలిన ముగ్గురి గురించీ చెప్పాడు కానీ, కేథరీన్‌ని వదిలేశాడు విజయ్‌. అంటే దీన్ని బట్టి సినిమాలో కేథరీన్‌ క్యారెక్టర్‌ గురించి పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదనుకోవాలో ఏమో.. ఇంతవరకూ సెకండ్‌ హీరోయిన్‌గానే సరిపెట్టుకున్న కేథరీన్‌, ఇప్పుడు ఫోర్త్‌ హీరోయిన్‌గా అస్సలేమాత్రం ఇంపార్టెన్స్‌ లేని క్యారెక్టర్‌ ఒప్పుకుందా.? అంటూ ఫ్యాన్స్‌ హర్టవుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS