లావణ్య - తేజు కెమిస్ట్రీ అదిరెలే!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తాజా చిత్రం 'ఇంటెలిజెంట్‌' పాటల జోరు మొదలైంది. ఈ సినిమా ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ 'లెట్స్‌ డూ..'ని ప్రబాస్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా మరో ఆడియో సింగిల్‌ విడుదలైంది. చిరంజీవి సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'ఛమక్‌ ఛం..' పాటని సాయి ధరమ్‌ తేజ్‌ 'ఇంటెలిజెంట్‌' కోసం రీమిక్స్‌ చేశాడన్న సంగతి తెలిసిందే. 

ఆ సాంగ్‌ ఆడియోనే ఇప్పుడు చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ పాటను విడుదల చేస్తూ రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌ చూస్తుంటే, మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. పోస్టర్స్‌తోనే సినిమాపై ఆశక్తి పెంచేస్తున్నారు. అసలే వినాయక్‌ డైరెక్షన్‌. అందులోనూ సినిమాలో తేజు అచ్చం పాతికేళ్ల నాటి చిరంజీవిని తలపిస్తున్నాడంటున్నారు. ఇక పోస్టర్స్‌ అయితే కెవ్వుకేకే. ఇవన్నీ సినిమాపై అమాంతం అంచనాల్ని పెంచేస్తున్నాయి. 

ఇదిలా ఉంటే, అందాల భామ లావణ్య త్రిపాఠి సాయి ధరమ్‌ తేజ్‌తో జత కడుతోంది ఈ సినిమాలో. ఇప్పుడీ ఇద్దరి కెమిస్ట్రీ గురించే ఇండస్ట్రీలో టాక్‌ అంతా. సినిమాలో తేజు - లావణ్య మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందట. ఇంతవరకూ రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌తోనే అది స్పష్టమవుతోంది. గతంలో 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలో తేజు - రెజీనా ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి కూడా ఇలాగే మాట్లాడుకున్నారంతా. డాన్సుల్లో ఈ ఇద్దరి మధ్యన గ్రేస్‌ ఆడియన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. 

మళ్లీ ఆదే స్థాయిలో జోష్‌ ఇప్పుడు తేజు - లావణ్య మధ్య ఉండబోతోందని అంటున్నారు. పోస్టర్స్‌ని చాలా బాగా డిజైన్‌ చేశారు. డిఫరెంట్‌ ప్యాటర్న్‌తో బ్రైట్‌ కలర్స్‌తో డిజైన్‌ చేసిన పోస్టర్స్‌ చాలా బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

వినాయక్‌ మార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాపై అంచనాలు హైప్‌ అందుకుంటున్నాయి. తేజు డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌, లావణ్య హాట్‌ హాట్‌ అందాలు ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS