ఛాంగురే బంగారు రాజా మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: ఛాంగురే బంగారు రాజా

నటీనటులు: కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ
దర్శకత్వం: సతీష్ వర్మ


నిర్మాతలు: రవితేజ
 
సంగీతం: కృష్ణ సౌరభ్
ఛాయాగ్రహణం: మెహర్బాబా మరియు అజ్జు
కూర్పు: కార్తీక్ వున్నవ


బ్యానర్స్: ఆర్‌టీ టీమ్‌వర్క్స్‌
విడుదల తేదీ: 15 సెప్టెంబర్ 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 1.5/5

 

థ్రిల్ చేసి నవ్వించడానికి క్రైమ్ కామెడీ మంచి జోనర్. మంచి కథ వుంటే పెద్ద బడ్జెట్ అవసరం లేకుండా ఈ జోనర్ సినిమాలు అలరిస్తుంటాయి. అందుకే మేకర్స్ కూడా ఈ జోనర్ పై ఆసక్తి చూపిస్తుంటారు. ఇపుడు రవితేజ నిర్మాణంలో ఓ క్రైమ్ కామెడీ వచ్చింది. అదే ఛాంగురే బంగారు రాజా. కంచరపాలెం, నారప్ప చిత్రాలతో ఆకట్టుకున్న కార్తిక్ రత్నం ఇందులో హీరోగా కనిపించడం, సత్య రవి బాబు లాంటి మంచి నటులు తోడవ్వడం, ట్రైలర్ ఆసక్తిని పెంచడం, రవితేజ కూడా ప్రమోషన్స్ లో పాల్గోవడం కొంత బజ్ ని క్రియేట్ చేసుకోగలిగింది. మరి సినిమా ఎలా వుందో, బంగార్రాజు కథ ఏమిటో చూద్దాం. 


కథ: అనకాపల్లి దగ్గర దుగ్గాడ అనేవూర్లో బంగార్రాజు (కార్తీక్ రత్నం) మెకానిక్. ఆ ఏరియాలో తనొక్కడే మెకానిక్. చాలా కమర్షియల్. రూపాయి లేనిదే రేంచీ కదపడు. అదే ఊర్లో రంగు రాళ్ళు కోసం చేసే ప్రయత్నంలో  సోము నాయుడుతో (రాజ్ తిరందాసు) గొడవ పడతాడు. సోముని చంపి చెరువులో పడేస్తానని ఊరి జనం అందరి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రోజే సోము ఎవరో హత్య చేసి చెరువులో పడేస్తారు. దీంతో ఆ కేసు బంగార్రాజు కి చుట్టుకుంటుంది. అసలు సోముని చంపింది ఎవరు ? ఈ కేసులో గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు పాత్రలకు వున్న లింక్ ఏమిటి ? అనేది మిగతా కథ. 


విశ్లేషణ: క్రైమ్ కామెడీలకి ఒక సెటప్ వుంటుంది. ఒక మర్డర్ జరుగుతుంది. అందులో ఇన్వాల్ అయిన పాత్రలని సీరియస్ గా కాకుండా హ్యూమర్స్ ట్రీట్ చేస్తూ నవ్వించే ప్రయత్నం జరుగుతుంది. దానికి తగ్గుట్టుగానే ఆ పాత్రలని డిజైన్ చేస్తారు. ఛాంగురే బంగారు రాజా కథ కూడా ఈ సెటప్ లో వుంటుంది. ఐతే ఇక్కడ దర్శకుడు రషోమోన్ ఎఫెక్ట్ తరహలో ఓ నాలుగు పాత్రల కోణాల్లో ఈ కథని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఐతే ఈ ప్రయత్నం పెద్దగా అలరించలేకపోయింది. ఈ క్రైమ్ కామెడీ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. పాత్రల పరిచయం, సన్నివేశాలు, మలుపులు అన్నీ ప్రేక్షకుడి ఊహకుముందే అందిపొతుంటాయి. కామెడీ కూడా వర్క్ అవుట్ కాలేదు. 


క్రైమ్ కామెడీలో కామెడీ లేకపోయినా పర్వాలేదు కానీ జరిగిన క్రైమ్ మాత్రం ఆసక్తిని పెంచాలి. దాని చుట్టూ బలమైన సన్నివేశాలని అల్లుకోవాలి. ఈ విషయంలోఛాంగురే బంగారు రాజా నిరాశపరుస్తుంది. ప్రేక్షకుడికి సహనానికి పరీక్షపెడుతూ, ఊహకుఅందిపోయే ఎలిమెంట్స్ ని కూడా సాగదీస్తూ కూర్చున్నాడు దర్శకుడు. కథ మూడు కోణాల్లో నడుస్తుంది. ఇందులో ఒక్క యాంగిల్ కూడా ఆసక్తికరంగా వుండదు. రవిబాబు ట్రాక్ ఐతే బోరింగ్ గా తయారైయింది. ఉన్నంతలో సత్య కొంచెం బెటర్. తన టైమింగ్ తో అక్కడక్కడ నవ్వించాడు. 


నటీనటులు:  కార్తీక్ రత్నం మంచి నటుడు.  ఐతే కథ లో బలం లేకపోవడంతో తన పాత్ర కూడా తెలిపోయినట్లయింది. మంగరత్నం గా చేసిన గోల్డీ నిస్సీ పాత్ర కూడా అంతమాత్రమే. సత్య కొన్ని చోట్ల నవ్విస్తాడు. రవిబాబుని సరిగ్గా వాడుకోలేకపోయారు. నిత్యశ్రీ, ఎస్తర్ ఓకే అనిపిస్తారు.  మిగతా నటీనటులందరూ పెద్దగా రిజిస్టర్ అవ్వరు.
 

టెక్నికల్: గుర్తుపెట్టుకునే పాటలు లేవు. నేపధ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ చాలా పదునుగా ఉండాల్సింది. అనవసరమైన సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. రైటింగ్ లో బ‌లం లేదు. డైలాగులు కూడా ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. క్రైమ్ కామెడీని ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి.


ప్లస్ పాయింట్స్ 

కొన్ని కామెడీ సీన్లు 
రంగురాళ్ళ నేపధ్యం 

మైనస్ పాయింట్స్    

బలహీనమైన కథ కథనం 
సాగదీత 
కొత్తదనం లేని మలుపులు 


ఫైనల్ వర్దిక్ట్ : ఛాంగురే 'బోరింగు'రాజా...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS