ఈమధ్య చిరంజీవి - నాగార్జునలు కలిసి ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ట్విట్టర్లో నాగార్జుననే ఈ ఫొటో పోస్ట్ చేశారు. `వైల్డ్ డాగ్ విడుదలకు ముందున్న ఒత్తిడి అంతా పోయింది` అంటూ నాగ్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోకి సంబంధించిన అసలు గుట్టు విప్పారు నాగ్.
వైల్డ్ డాగ్ సినిమా విడుదలకు ముందు రోజు.. నాగార్జున ఇంట్లో ఒక్కరే ఉన్నార్ట. ఇంట్లో వాళ్లంతా ప్రివ్యూల హడావుడిలో పడిపోయిన ఒంటరి క్షణాల్లో... చిరు నుంచి నాగ్ కి ఫోన్ వచ్చిందట. `రాజమండ్రి నుంచి మంచి చేపలొచ్చాయి.. రా కలిసి భోంచేద్దాం` అని నాగ్ ని ఆహ్వానించార్ట. వెంటనే నాగ్ వెళ్లడం, చిరుస్వయంగా చేపల కూర వండి పెట్టడం, ఇద్దరూ సరదాగా కూర్చుని మాట్లాడుకోవడం జరిగిపోయాయి. ఆ రోజుల్లో సినిమా విడుదలకు ముందు వాళ్లిద్దరూ ఎలా టెన్షన్ పడేవాళ్లో చెప్పుకుంటూ నవ్వుకున్నామని, ఆ రోజు బాగా గడిచిందని చెప్పుకొచ్చాడు నాగ్.