ఒకప్పుడు సౌత్ కి పాలిటిక్స్ లో కానీ సినిమాల్లో కానీ సరైన గుర్తింపు ఉండేది కాదు. ఎక్కడ చూసినా నార్త్ హవా కొనసాగేది. ఈ క్రమంలోనే ఆపద్భాందవుడు సినిమాకి గాను చిరుకి ఇవ్వాల్సిన నేషనల్ అవార్డుని నార్త్ వారికి ఇచ్చినట్లు ఆ మధ్య తెలిసింది. కానీ ఇపుడు సీన్ మారింది. తెలుగు సినిమా, తెలుగు హీరోలకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తెలుగు సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటుతోంది. రాజకీయాల్లో కూడా తెలుగు స్టేట్స్ కేంద్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. NDA సర్కార్ కి కీలకంగా మారారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే అద్భుత మైన న్యూస్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.
అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవికి 'భారతరత్న' ఇవ్వనున్నారని, బాలకృష్ణకి 'పద్మవిభూషణ్', మెగా బ్రదర్ నాగబాబుకి 'రాజ్యసభ ఎంపీ ' అని వినిపిస్తోంది. నిజంగా ఇది నెరవేరితే తెలుగువారికి ఇంతకు మించిన విజయం ఏముంది. చిరంజీవికి ఇప్పటికే 2006 లో పద్మభూషణ్, 2024 లో పద్మ విభూషణ్ లభించింది. చిరుకి ఇప్పుడు భారతరత్న ఇవ్వనున్నారని సమాచారం. పొత్తులో భాగంగా నాగ బాబు చేసిన త్యాగానికి గుర్తింపుగా రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.
నందమూరి ఫాన్స్ ఎప్పటినుంచో బాలయ్యకి పద్మ అవార్డు రాలేదని నిరాశగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో ఫాన్స్ కోరిక నెరవేరనుంది. జనవరి 26 న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో బాలయ్యకి పద్మ విభూషణ్ ఇవ్వనున్నారని సమాచారం. చంద్రబాబు కూడా బాలయ్య పేరు సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో చిరు, నాగ బాబు, బాలయ్య ఒకేసారి నేషనల్ వైడ్ కీర్తి పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు.