హైదరాబాద్ లో జరుగుతున్న తెలుగు ప్రపంచ మహాసభలు నేపధ్యంలో నిన్న జరిగిన సినీ సంగీత విభావరిలో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం జరిగింది.
ఆ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి-మంత్రి కేటీఆర్ ల మధ్య జరిగిన ఓ సంబాషణని చిరు గుర్తుచేసుకున్నారు. ఆ సంబాషణ ఏంటంటే- ఈ సభకి ఆహ్వానించడానికి చిరంజీవికి కేటీఆర్ ఫోన్ చేసిన సమయంలో వారి ఫోన్ సంభాషణలో ఎక్కువశాతం చిరు ఆంగ్లంలోనే మాట్లడుతుండడం గమనించిన కేటీఆర్ ‘అన్న నేను మిమల్ని ప్రపంచ తెలుగు మహాసభలకి ఆహ్వానించే సందర్భంలో మీరు ఇంగ్లిష్ లో మాట్లాడడం ఎంతవరకు సబబు’ అని చమత్కరించాడట.
అయితే కేటీఆర్ ఇది సరదాగానే అన్నప్పటికీ ఇది తనకి ఎక్కడో చివ్వుక్కుమనిపించింది అని అన్నారు మెగాస్టార్. ఇక ఈ సందర్భంలోనే తాను ఒక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఇక పై సాటి తెలుగు వాడితో అచ్చ తెలుగులోనే సంబాషించే ప్రయత్నం తప్పక చేస్తాను అని అలాగే తమ ఇంటి సభ్యులని కూడా తెలుగులోనే మాట్లాడమని కోరతాను అని తెలిపాడు.