ఇదివరకెప్పుడూ లేనంత జోరులో ఉన్నారు మెగాస్టార్. ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు సైతం - సినిమా తరవాత సినిమా అనే సూత్రం పాటించే మెగాస్టార్ ఈ ఇన్నింగ్స్ లో మాత్రం ఒకేసారి రెండు మూడు కథల్ని ఒకే చేసేస్తున్నారు. ఆచార్య సెట్స్‌పై ఉండగానే లూసీఫర్, వేదాళం రీమేక్‌లను ఓకే చేశారు. బాబి కథకూ ఓకేచెప్పారు. అంటే.. చిరు చేతిలో నాలుగు సినిమాలున్నాయన్నమాట. వేదాళం రీమేక్ ని చిరు మెహర్ రమేష్ చేతికి అప్పగించిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ కూడా స్క్రిప్టుని తయారు చేసి చిరుకి వినిపించడం, చిరు ఓకే చేయడం జరిగిపోయాయి. అయితే... మెహర్ రమేష్ తో సినిమా విషయంలో చిరుని వెనక్కి లాగుతున్నట్టు సమాచారం.
మెహర్ ఓ డిజాస్టర్ దర్శకుడని, తనతో సినిమా చేయడం అనవసరమని, మార్కెట్ పరంగా హైప్ ఉండదని చిరుని వారిస్తున్నార్ట. మెహర్ రమేష్ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టమని అల్లు అరవింద్ లాంటి సన్నిహితులు సూచిస్తున్నట్టు వినికిడి. కానీ చిరు మాత్రం మెహర్ పై పూర్తి నమ్మకం ఉంచినట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా మెగా కాంపౌండ్ లోనే తిరుగుతున్నాడు మెహర్. తనకోసమైనా సినిమాని ఓకే చేయాలని చిరు భావిస్తున్నాడట. కాకపోతే.... బడ్జెట్ ని కంట్రోల్ లో పెట్టమని మెహర్ ని సూచించాడట చిరు. ఆ రకంగా.. మెహర్ విషయంలో చిరు జాగ్రత్త పడుతున్నట్టే.