అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. యథార్థ ఘటనలను ఆధారం చేసుకొని రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మ అనే ఒక వైవిధ్యమైన పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా నటిస్తోన్న ఈ మూవీలో మరో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ డైలాగ్స్ రాశారు.