చిరు - మోహ‌న్ బాబు మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోందా?

మరిన్ని వార్తలు

చిరంజీవి - మోహ‌న్ బాబుల మ‌ధ్య ఉన్న అనుబంధం విచిత్ర‌మైంది. ఇద్ద‌రూ మంచి దోస్తులుగా క‌నిపిస్తారు. అప్పుడే... చిరుబుర్రులాడుకుంటుంటారు. ఆమ‌ధ్య చిరు పుట్టిన రోజుకి మోహ‌న్ బాబు చెక్క‌తో త‌యారు చేసిన బైక్ ని పంపి.. చిరు, ఆయ‌న అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు. `స‌న్నాఫ్ ఇండియా` టీజ‌ర్ కి చిరు వాయిస్ ఓవ‌ర్ అందించి - మోహ‌న్ బాబు అభిమానానికి పాత్రుడ‌య్యాడు చిరు. ఇద్ద‌రూ అలా.. ఒక‌రిపై మ‌రొక‌ర‌రికి ఉన్న అభిమానాన్ని చూపించుకుంటూనే ఉంటారు.

 

అయితే ఇద్ద‌రి మ‌ధ్య మ‌రోసారి కోల్డ్ వార్ మొద‌లైంద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. దానికి కార‌ణం.. `మా` ఎన్నిక‌లే. మా ఎన్నిక‌ల బ‌రిలో చాలామంది ఉన్నారు. ఎంత‌మంది ఉన్నా, ప్ర‌ధాన‌మైన పోటీ ప్ర‌కాష్ రాజ్ - విష్ణుల మ‌ధ్యే. ప్ర‌కాష్ రాజ్‌కి చిరు అండ‌దండ‌లున్నాయి. ప్ర‌కాష్ రాజ్ ని గెలిపించ‌డానికి చిరు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు.. మోహ‌న్ బాబు విష్ణు గెలుపుకోసం కృషి చేస్తున్నారు. అందుకే.. ఇద్ద‌రి మ‌ధ్యా కోల్డ్ వార్ మొద‌లైంది. సోమ‌వారం చిరంజీవి ఇంట్లో సినీ పెద్ద‌ల కీల‌క‌మైన స‌మావేశం జ‌రిగింది. దానికి మోహ‌న్ బాబు రాలేదు. అస‌లు ఆయ‌న‌కు ఆహ్వాన‌మే అంద‌లేద‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. చిరు - మోహ‌న్ బాబుల‌మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌న‌డానికి ఇదే బ‌ల‌మైన సాక్ష్యం. త‌న‌ని పిల‌వ‌లేద‌ని మోహ‌న్ బాబు కూడా చిరుపై గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. మోహ‌న్ బాబుకే కాదు. ఇండ్ర‌స్ట్రీలోని చాలామంది పెద్ద‌ల‌కు చిరు నుంచి పిలుపు రాలేదు. అందులో.. బాల‌కృష్ణ ఒక‌రు. మొత్తానికి `మా` ఎన్నిక‌ల వ‌ల్ల‌.. హీరోల మ‌ధ్య కోల్డ్ వార్ లూ, గ్యాప్ లూ మొద‌లైపోతున్నాయి. ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వెళ్తుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS