ఆగస్టు 22.. చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్ రెడీ అవుతోంది. చిరు చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) షూటింగ్ జరుపుకొంటున్నాయి. ఈ మూడింటికి సంబంధించిన కీలకమైన అప్‌డేట్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాబోతున్నాయి.
గాడ్ ఫాదర్ నుంచి ఓ టీజర్, భోళా శంకర్ నుంచి ఓ పాట, వాల్తేరు వీరయ్య ఫస్ట్ లుక్... చిరు పుట్టినరోజు కానుకగా విడుదల కాబోతున్నాయని టాక్. ఆగస్టు 21 నుంచే చిరు టీజర్లు, ఫస్ట్ లుక్ ల హంగామా మొదలైపోతుంది.
చిరు కొత్త సినిమాలకు సంబంధించిన కబుర్లు కూడా పుట్టిన రోజునే తెలిసే అవకాశాలున్నాయి. మారుతితో చిరు ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. దాంతో పాటు `భీష్మ`తో ఆకట్టుకొన్న వెంకీ కుడుములతో చిరు ఓసినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా చిరు పుట్టిన రోజునే వస్తోందని సమాచారం. సో.. మెగా ఫ్యాన్స్ - రెడీ అయిపోండిక.