లాక్ డౌన్ వల్ల ఎక్కడివాళ్లు అక్కడే గప్ చుప్ అయిపోవాల్సివచ్చింది. ఎవరి ఇళ్లలో వాళ్లే. ఆదివారం వస్తే చాలు బంధువులు - స్నేహితుల ఇంటికి వెళ్లి విందు వినోదాలతో కాలక్షేపం చేసేవాళ్లు.. ఆ ఆనందాన్ని మిస్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంతే. లాక్ డౌన్ వల్ల ఆయనేం మిస్ అవుతున్నారన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. లాక్ డౌన్‌కి ముందు ఓ ఆదివారం, తన ఇంట్లో సరదాగా తమ్ముళ్లతోనూ, అమ్మతోనూ కలిసి లంచ్ చేస్తున్న ఫోటోని ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఆ ఫొటోలో పవన్ కల్యాణ్, నాగబాబుతో పాటు చిరు మాతృమూర్తి అంజనాదేవి కూడా కనిపించారు. లాక్ డౌన్ వల్ల ఇలాంటి ఆనందాలు అందరూ మిస్ అవుతున్నారని, త్వరలోనే... ఆ పాత రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు చిరు. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లాక్ డౌన్ ఎత్తేశాక.. ఓ ఆదివారం మళ్లీ ఇలాంటి ఫొటోనే చిరు పంచుకోవాలని మనమూ ఆశిద్దాం!