చిరంజీవితో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మలు రాధిక, సుహాసినీ, సుమలత. ఈ ముగ్గురూ ఇప్పుడు తాజాగా బుల్లితెరపై ఆయనతో కలిసి సందడి చేయడానికి వచ్చారు. అదే బుల్లితెర మెగా గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఉమెన్స్ డే సందర్భంగా ఈ గేమ్‌షోకి విచ్చేశారు ఈ ముద్దుగుమ్మలు. ఈ ముద్దుగుమ్మలిద్దరూ తమిళ నటీమణులు అయినప్పటికీ తెలుగులో చక్కగా మాట్లాడుతున్నారు అదెలా సాధ్యమని చిరంజీవి వారిని అడగ్గా, అందుకు కారణం మీరే అని ఆ ముద్దుగుమ్మలు సమాధానమిచ్చారు. ఆయనతో కలిసి సినిమా చేసే నాటికి వీరికి తెలుగులో అస్సలు మాట్లాడడం రాదట. ఆయనతో నటించడం మొదలుపెట్టినప్పటి నుండే తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారట. అంటే ఈ ముద్దుగుమ్మలకు మొట్ట మొదటి సారిగా తెలుగు నేర్చించింది మెగాస్టార్ చిరంజీవేనట. ఆ తర్వాత నుండీ తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించడం.. అలా అలా తెలుగు భాష అలవాటయిపోయింది. అందుకే తమకు తెలుగు నేర్పించడంలో చిరంజీవే తమకు తొలి గురువు అని ఆయనకు నమస్కారం చేశారు. ఇప్పుడు అచ్చమైన తెలుగు భామల్లానే తెలుగులో గల గలా మాట్లాడేస్తున్నారు. అంతేకాదు అప్పట్లో కూడా ఈ ముద్దుగుమ్మలు తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకునేవారు. ఇప్పటి హీరోయిన్లలా కాదు. మొత్తానికి ఉమెన్స్ డే సందర్భంగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో కి ఈ ముద్దుగుమ్మల ఎంట్రీతో కొత్త గ్లామర్ వచ్చింది.