దటీజ్‌ మెగాస్టార్‌ అంతే.!

By iQlikMovies - June 22, 2018 - 16:25 PM IST

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హైద్రాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. 

స్వాతంత్య్రానికి ముందు నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మరుగున పడిపోయిన ఎన్నో విశేషాలను సినిమా ద్వారా చూపించబోతున్నారు. ప్రతీ ఒక్క తెలుగోడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. ఇలాంటి గొప్ప చరిత్ర ఆధారంగా చిరంజీవి సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా, అది ఇన్నాళ్లకు కుదిరింది. అందుకే ఎంతో ఇష్టపడి, కష్టపడి నటిస్తున్నారు చిరంజీవి. వయసు, అలసట దరి చేరనీయకుండా, డెడికేషన్‌తో పని చేస్తున్నారట. ఆయన డెడికేషన్‌కి చిత్ర యూనిట్‌ షాక్‌ అవుతోందట. యూనిట్‌ మొత్తానికి చిరు సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారట తన జోష్‌తో. 

హాలీవుడ్‌ నుండి వచ్చిన ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ సమక్షంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న యాక్షన్‌ ఘట్టాలకు ఔట్‌పుట్‌ చాలా బాగా వస్తోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS