Chiranjeevi: ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య చిరంజీవి ద‌ర్శ‌కుల సెల‌క్ష‌న్ అభిమానుల్ని క‌ల‌వ‌ర పెడుతోంది. మారుతి, మెహ‌ర్ ర‌మేష్‌ల‌తో చిరంజీవి సినిమాల్ని ఒప్పుకోవడం ఫ్యాన్స్‌కి మింగుడు ప‌డ‌డం లేదు. చిరంజీవి స్టార్ ఇమేజ్‌ని వీళ్లంతా హ్యాండిల్ చేయ‌గ‌ల‌రా? అని అనుమానిస్తున్నారు. `భోళా శంక‌ర్‌` మొద‌లై ఇన్ని రోజులు అయినా... ఈ సినిమాపై ఎలాంటి హైపూ లేదు. అంచ‌నాలు ఏర్ప‌డ‌లేదు. ఇప్పుడు మ‌రో ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి చిరంజీవి ఛాన్స్ ఇచ్చిన‌ట్టు టాక్‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు... ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్‌ ప్ర‌భుదేవా.

 

చిరంజీవి - ప్ర‌భుదేవాల‌ది సూప‌ర్ హిట్ కాంబో. చిరుకి ప్ర‌భుదేవా డాన్స్ కంపోజ్ చేస్తే... ఆ పాట సూప‌ర్ హిట్టే. అయితే చిరుని డైరెక్ట్ చేసిన `శంక‌ర్ దాదా జిందాబాద్‌` మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. చాలా కాలం త‌ర‌వాత చిరంజీవి సినిమా `గాడ్ ఫాద‌ర్‌`లోని ఓ పాట‌కు ప్ర‌భుదేవా నృత్య రీతులు స‌మ‌కూర్చాడు. ఇదే సంద‌ర్భంలో ప్ర‌భుదేవాతో ఓ సినిమా చేయాల‌ని చిరు ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇది కూడా రీమేకే అట‌. నెట్ ఫ్లిక్స్‌లోని ఓ కొరియ‌న్ యాక్ష‌న్ డ్రామా చిరంజీవిని బాగా ఆక‌ట్టుకొంద‌ని, దాన్ని సినిమాగా మార్చాల‌ని భావిస్తున్నార‌ని, ఆ బాధ్య‌త‌ని చిరు ప్ర‌భుదేవాపై పెట్టార‌ని తెలుస్తోంది. ద‌ర్శకుడిగా ఇప్పుడు డ‌ల్ స్టేజీలో ఉన్నాడు ప్ర‌భుదేవా. మ‌ళ్లీ ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగు వేయ‌ను.. అని కొద్దిరోజుల క్రితం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకొన్నాడు. కానీ.. చిరు అడ‌గ‌డంతో మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టాల్సివ‌స్తోంది. కాక‌పోతే.. ఫామ్ లో లేని ప్ర‌భుదేవాకు ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ ఇవ్వ‌డం ఏమిట‌న్న‌ది అభిమానుల ప్ర‌శ్న‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS