చిరు సినిమాలో నటించాలని ఉందా?

మరిన్ని వార్తలు

భోళాశంకర్ మూవీ డిజాస్టర్ తో మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక నుంచి మొహమాటానికి పోయి ప్రాజెక్ట్స్ ఒప్పుకోకూడదని డిసైడ్ అయ్యి మంచి కథలపై వర్క్ చేస్తున్నారు. టాలెంట్ ఉంటే కొత్త దర్శకులకి కూడా అవకాశమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  బింబిసార డైరక్టర్ వశిష్ఠతో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ దాదాపు 70 శాతం VFX పైనే చిత్రీకరణ జరుపుకుంటోదని సమాచారం. ఈ మూవీ హీరోయిన్ త్రిష ఈ మధ్యే సెట్ లో అడుగుపెట్టింది.
 

విశ్వంభర మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి  వచ్చింది . ఈ సినిమాలో నటించేందుకు ఇద్దరు కవల పిల్లలు కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చారు మేకర్స్. ఐదు సంవత్సరాలు లోపు ఉన్న ఇద్దరు మగ పిల్లలు కావాలంటూ పోస్ట్ చేశారు.  కవలలు ఉన్నవారి పిల్లల డీటెయిల్స్ ని సెండ్ చేయాలంటూ సమాచారం ఇచ్చారు. ఆ పిల్లలకు సంబంధించిన వీడియోలను [email protected] మెయిల్ చేయడం లేదా +91-8977090354 నెంబర్ కి వాట్సాప్ గాని చేయాలంటూ పేర్కొన్నారు.


ఈ కాస్టింగ్ కాల్ తో ఈ సినిమాలో చిరంజీవి  డ్యూయెల్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంటరెస్ట్, ఉన్నవారు ఈ ఛాన్స్ ని ఉపయోగించుకొని త్వరగా మీ పిల్లల వీడియోని సెండ్ చేసేయండి.  ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మొత్తం విశ్వాన్ని చూపించేందుకు దాదాపు 13 సెట్స్ ని నిర్మించారని టాక్.  ఈ మూవీకి చోటా కే నాయుడు కెమెరా మెన్‌ కాగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS