సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ అనసూయ పై ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా?!

మరిన్ని వార్తలు

ఈ మధ్యనే జరిగిన ఓ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఒక సీనియర్ కెమరామెన్ ఆ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన నటి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, విన్నర్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో చోటా కే నాయుడు మాట్లాడుతూ స్పెషల్ సాంగ్ చేసిన అనసూయని “చాలా హాట్ ఫిగర్” అని సంభోదించాడు. అలాగే సినిమా యూనిట్ తో అనసూయ ఒక 5 రోజులు ఫారిన్ ట్రిప్ అంటే "ఎగిరి గంతేసా! అనసూయ మనతో 5 రోజులు ఫారిన్ లో ఉండబోతోందనమాట" అని స్టేజ్ పై చెప్పడంతో అనసూయతో సహా అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.

చోటా.కే.నాయుడు కి ఇండియన్  ఫిలిం ఇండస్ట్రీ లోనే టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా, సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ గా ఎంతో మంచి పేరు, గౌరవం ఉంది. అలాంటి వ్యక్తి ఇలా పబ్లిక్ ఫంక్షన్ లో తన స్థాయికి తగని కామెంట్స్ చేయడం సరికాదు అనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. పైగా పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక నటి పై, ఇలాంటి వేదికలపై మాట్లాడేటప్పుడు ఒకసారి అలోచించి మాట్లాడడం మంచిది అని అందరూ భావిస్తున్నారు.

ఇలాంటి కామెంట్స్ సరదాకి ఆఫ్ స్క్రీన్ లో చేసుకుంటే ప్రాబ్లం లేదు కాని ఇలా పబ్లిక్ ఫంక్షన్ లో అయితే ఆ నటికీ, వారి కుటుంబసబ్యులకీ ఇబ్బందికరంగా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంది. గతంలో ప్రముఖ నటుడు అలీ కూడా యాంకర్ సుమ విషయంలో కామెడీ కి కొన్ని అనుచిత కామెంట్స్ చేసినందుకు సోషల్ మీడియా మరియు బయట ఎంతటి దుమారం రేగిందో మనం చూశాం!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS