యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.
అదేంటంటే, ఇప్పటివరకు జై లవ కుశ సినిమాకి కెమరామెన్ గా పనిచేస్తున్న సీకె మురళీధరన్ ఆ భాద్యతలు నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు పనిచేయనున్నారు.
అయితే దర్శకుడికి-కెమెరామెన్ కి మధ్య తలెత్తిన స్పర్ధల నేపధ్యంలోనే ఇది జరిగిందంటూ రూమర్స్ మొదలయ్యాయి. అయితే మురళీధరన్ ఇంతకుముందే వేరే ప్రాజెక్ట్ కోసం కమిట్ అయి ఉండడంతో ఇలా వెళ్ళాల్సి వస్తుందని యూనిట్ వర్గాల సమాచారం.