మే నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగనుంది గనుక, ఈలోగా సినిమాల విడుదలపై ఆశల్లేవు ఎవరికీ. ఆ తర్వాత అయినా సినిమా ది¸యేటర్లు తెరుచుకుంటాయా.? అన్నదానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూన్ మొదటి వారంలో సినిమా షూటింగులకు అనుమతులొస్తాయనీ, జులై మొదటి వారం వరకూ సినిమా ది¸యేటర్లు తెరుచుకునే అవకాశం వుండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సరే, అప్పుడన్నా ది¸యేటర్లు తెరుచుకుంటే పరిస్థితులెలా వుంటాయి.? ప్రేక్షకులు ది¸యేటర్లకు పోటెత్తడం అయితే కొంత కష్టమే. ఎందుకంటే, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే వుండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సినిమా ది¸యేటర్లలో సోషల్ డిస్టెన్స్ అంటే అది జరిగే పని కాదు. మరెలా.? పోనీ, సోషల్ డిస్టెన్స్ లాంటివి లేకపోయినా, జనంలో భయాలు మాత్రం అలాగే వుంటే, సినిమాలు నడిచేదెలా.? ఇలాంటి ప్రశ్నలు సినీ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జనం, లాక్‌డౌన్ నేపథ్యంలో ‘ఓటీటీ’కి బాగా కనెక్ట్ అయిపోయారు. దాంతో, సినిమాలకు ఇదివరకట్లా జనాన్ని రప్పించడం కష్టమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి లాంటోళ్ళు మాత్రం, పరిస్థితులు మళ్ళీ మామూలుగానే మారతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తగా వుండాలన్న వాదనను రాజమౌళి విన్పిస్తుండడం గమనార్హం. అంటే, ఓటీటీని (వెబ్‌సిరీస్‌లు) సినిమా రంగం గట్టి పోటీగానే బావిస్తోందన్నమాట.