కమెడియన్ విజయ్ సాయి ఈరోజు ఉదయం తన ఇంటిలో ఉరివేసుకుని చనిపోయిన సంగతి ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురిచేసింది.
అయితే తను ఆత్మహత్య చేసుకోవడం వెనుక వనిత, శశిధర్, అడ్వకేట్ ఉన్నారు అని చెబుతూ తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫ్ వీడియో తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో పోలిసుల వద్ద ఉన్నట్టు తెలుస్తున్నది.
తన భార్య తన నుండి మూడు కోట్లు ఇవ్వమంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నది అని కూడా ఆ వీడియో లో పేర్కొన్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు.
ఏదేమైనప్పటికీ ఎవ్వరు ఊహించని విధంగా కమెడియన్ విజయ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబసభ్యులతో పాటు అతని స్నేహితులు తీవ్ర దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయారు.