లక్ష్మీరాయ్‌కి గాయం: ఇదీ వెటకారమే

మరిన్ని వార్తలు

అయ్యో చక్కనమ్మా రక్తమోడిందే. అసలింతకీ ఈ చక్కనమ్మ ఎవరు? అనుకుంటున్నారా? బాలీవుడ్‌లో 'జూలీ - 2' సినిమాతో తెగ పాపులరైపోయిన బ్యూటీ లక్ష్మీరాయ్‌. తన హాట్‌ హాట్‌ అందాలతో స్టిల్స్‌, టీజర్స్‌, ట్రైలర్స్‌ అహో ఒక్కటేమిటి, సోషల్‌ మీడియాని హీటెక్కించేస్తోందంతే. అయితే ఈ హాట్‌ బ్యూటీ రక్తమోడిందా? ఎందుకు.. అనుకుంటున్నారా? అమ్మడు యాక్షన్‌ సీక్వెన్సెస్‌ చేస్తున్నప్పుడు అతిగా టెంప్ట్‌ అయిపోతూ ఉంటుందట. అలా అనుకోకుండా దెబ్బ తగిలిందట. ఇంతకీ ఆ యాక్షన్‌ సీన్స్‌ దేనికో కానీ, అమ్మడు తనకి తగిలిన దెబ్బని ఫోటో తీసి, ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పోస్ట్‌ పెట్టింది బాగానే ఉంది. అయితే ఆ పోస్ట్‌కి నెటిజన్స్‌ నుండి వస్తున్న కామెంట్స్‌ వింటుంటే అహో..! కొన్ని పోజిటివ్‌ కామెంట్స్‌, కొన్ని నెగిటివ్‌ కామెంట్స్‌ ఉన్నాయి. నెగిటివ్‌, పోజిటివ్‌ ఏంటి.. అయితే మీరూ చూడాల్సిందే ఆ ఫోటో, చూస్తే కానీ అర్ధం కాదు మరి. అసలింతకీ ఆ దెబ్బ ఎక్కడ తగిలిందో తెలియని పరిస్థితి నెటిజన్స్‌కి. అర్ధమైన వారికి అర్ధమైనట్లుగా రీ కామెంట్స్‌ పెట్టేశారు. 'ఇంతకీ ఎక్కడమ్మా.. దెబ్బ తగిలింది..' అంటూ కొంతమంది పోస్ట్‌ చేస్తే, 'రిస్క్‌ చెయ్యొద్దు, టేక్‌ కేర్‌ అమ్మా..' అంటూ మరికొన్ని కామెంట్స్‌ వచ్చాయి. అయితే ఇంతకీ దెబ్బ తగిలిన ప్లేస్‌ ఏంటో తెలీదు కానీ లక్ష్మీరాయ్‌ పెట్టిన ఈ ఫోటోతో భలే పబ్లిసిటీ స్టంట్‌ చేసిందిలే. త్వరలోనే 'జూలీ - 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌. బోల్డ్‌ కంటెన్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో లక్ష్మీరాయ్‌ దశ ఎలా తిరగనుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS