ప్రముఖ నటి హన్సిక పైన నడిగర్ సంఘంలో చీటింగ్ కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే, హన్సిక కి మేనేజర్ గా పనిచేసిన మునుస్వామికి చెల్లించవలసిన డబ్బుని ఇప్పటివరకు తిరిగివ్వలేదు అని ఆయన నడిగర్ సంఘాన్ని ఆశ్రయించాడు. ఇప్పటివరకు తాను చాలా సార్లు తనకి డబ్బు చెల్లించమని అడగగా వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి నడిగర సంఘాన్ని తనకి న్యాయం చేయమని కోరినట్టుగా తెలిపాడు.
తనకు ఇవ్వవలసిన మొత్తాలకు రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. అవసరమైతే వాటిని కూడా బయటపెడతాను. వాటి ఆధారంగానే కేసు నమోదు చేశాను అని మునుస్వామి మీడియాకు వెల్లడించాడు.
ఇక ఈ అంశం పైన హన్సిక ఇంతవరకు స్పందించకపోవడం ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. అలాగే నడిగర్ సంఘం కూడా ఈ ఫిర్యాదు పైన స్పందించాల్సి ఉంది.




