మంచు విష్ణు పై నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదయింది.
అందుతున్న వివరాల ప్రకారం, మంచు విష్ణు ఈ మధ్య నిరసనలు వెల్లువెత్తిన సమయంలో మన దేశాన్ని రెండుగా విభజిస్తే బాగుంటుందని అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడట? దీని పై ఆర్ మణిరత్నం అనే వ్యక్తి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణు పై ఫిర్యాదు చేశాడు.
కాని ఇలాంటి వ్యాఖ్యలు విష్ణు చేసినట్టుగా మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. స్పెషల్ స్టేటస్ కోసం ఉధ్యమం జరుగుతున్న ఇలాంటి సమయంలో మంచు విష్ణు పై ఇలాంటి ఫిర్యాదు రావడం చర్చనీయాంశం అయింది.
ఇక పోలీసులు మాత్రం ఈ ఫిర్యాదు పై తమ స్పందన ఇంతవరకు తెలియచేయలేదు. అలాగే విష్ణు సైతం తన పై వచ్చిన ఫిర్యాదుకు జవాబు ఇవ్వకపోవడం గమనార్హం.