పవన్ కల్యాణ్ నటించిన చిత్రం `వకీల్ సాబ్`. ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది. ఇప్పటికే... వకీల్ సాబ్ మానియా తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఏప్రిల్ 3న `వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలని దిల్ రాజు ఫిక్సయ్యారు. యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేద్దామనుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, చరణ్‌లు వస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి అనుమతులు లభించడం లేదు.
కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న వేళ... ఎలాంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఇటీవలనే జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం వకీల్‌సాబ్ సిని మా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఈ ఈవెంట్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్ తమకు ఇచ్చిన లేఖలో పేర్కొనడం జరిగిందని, తాజా జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు కుదరవని స్పష్టం చేశారు. మరి... ఇలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని వాయిదా వేస్తారా? లేదంటే.. తక్కువమంది అభిమానుల మధ్య జరుపుకోవడానికి కొత్తగా అనుమతులు తీసుకుంటారా? అనేది చూడాలి.