ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టాడు అఖిల్. తొలి సినిమా `అఖిల్` ఫ్లాపు. ఆ తరవాత హలో కూడా అనుకున్న ఫలితం తీసుకురాలేదు. మిస్టర్ మజ్ను కూడా విజయాన్ని అందించలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. అటు అఖిల్ కీ, ఇటు బొమ్మరిల్లు భాస్కర్‌కీ హిట్లే లేవు. అయినా సరే.. బిజినెస్ పరంగానూ ఈ సినిమాకి క్రేజ్ ఏర్పడింది.
ఇప్పుడు శాటిలైట్‌కి మంచి రేటు వచ్చింది. మా టీవీ ఈసినిమాని రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. కరోనా నేపథ్యంలో టీవీ ఛానళ్లు కొత్త సినిమాల్ని కొనడానికి ఏమాత్రం ఉత్సాహం చూపించడం లేదు. పైగా ఓటీటీకి సినిమాని అమ్ముకుంటే శాటిలైట్ పరంగా రేటు ఇవ్వలేరు. అయినా సరే, ఈ సినిమాకి మంచి రేటు గిట్టుబాటు అయ్యింది. అఖిల్ గత మూడు సినిమాలతో పోలిస్తే.. శాటిలైట్ పరంగా ఈ సినిమాకి అత్యధిక రేటు లభించినట్టైంది.