అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'దంగల్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డులు సృష్టించగా, ఒక్క చైనాలోనే 9000 ధియేటర్లలో విడుదలయ్యింది. ఇంతవరకూ ఇండియన్ సినిమాల్లో విదేశాల్లో ఇన్ని ధియేటర్స్‌లో విడుదలైన సినిమా ఇదే. అంతేకాదు కలెక్షన్స్‌లో కూడా ఇదే నెంబర్ వన్ రేంజ్‌లో ఉంది ఇంతవరకూ. 1000 కోట్ల వైపుగా దూసుకెళ్లిన సినిమా ఇదే. ఇదేమీ ప్రపంచ వ్యాప్తంగా నమోదైన రికార్డు కాదు. కేవలం ఓ భారతీయ చిత్రం పరదేశమైన చైనాలో సాధించిన రికార్డు. చైనాలో నిన్నటికి ఈ సినిమా 1000 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ స్థాయిలో ఓ భారతీయ సినిమా ఇంతగా రికార్డులు సృష్టించిందంటే భారతీయ సినిమా సత్తా ఏంటో తెలుస్తోంది. నిన్న కాక మొన్న రిలీజైన తెలుగు సినిమా 'బాహుబలి ది కన్‌క్లూజన్' రికార్డులు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ సినిమాలనే తలదన్నేలా వసూళ్లు సాధించింది. ఇంతవరకూ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న 'దంగల్' ప్లేస్‌ని వెనక్కిన నెట్టేసి ఆ ప్లేస్‌లో 'బాహుబలి ది కన్‌క్లూజన్' వచ్చి చేరింది. రెండో స్థానం 'దంగల్' దక్కించుకుంది. రెజ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నలుగురు కూతుళ్లకు తండ్రిగా అమీర్ ఖాన్ నటన ఆకట్టుకునేలా ఉంది. హర్యాణాకి చెందిన మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగట్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరెక్కింది. చైనాలో ఈ సినిమాకి ఇంతటి అభిమానం దక్కినందుకు సినిమా డైరెక్టర్ నితీష్ తివారీ చైనా ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.