ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రం ఇండియాలోనే కాకుండా పొరుగు దేశం అయిన చైనాలో కూడా తన సత్తా చాటుతున్నది.
మొదట రిలీజ్ అయినప్పుడు, దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 716కోట్లు ఆర్జించింది. ఇందులో రూ 511 కోట్లు ఇండియాలో కాగా, రూ 205 కోట్లు ఓవర్సీస్ కలెక్షన్స్. ఇక మొన్నీమధ్యన చైనాలో విడుదల అయిన ఈ చిత్రం కొల్లగొడుతున్న కలెక్షన్స్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
ప్రస్తుతం ఈ చిత్రం, రూ 803 కోట్లు సంపాదించి తన పేరిట ఉన్న రికార్డుని తానే బద్దలుకోట్టుకుంది. చైనాలో ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
చూద్దాం. చైనాలో ఈ కలెక్షన్స్ జోరు ఎంతవరకు వెళ్ళనుందో..