ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రం కలెక్షన్స్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
ఇప్పటివరకు దంగల్ రూ 1930 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది. దీనితో ఇది భారతీయ చలనచిత్రాల్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాదించిన చిత్రంగా నిలిచింది.
ఇన్ని కోట్లు సంపాదించడంతో, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్ట్ చేసిన నాన్-ఇంగ్లీష్ టాప్ 5 చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇండియాలో కన్నా చైనాలోనే ఎక్కువగా కలెక్ట్ చేసిన ఒక భారతీయ చిత్రంగా కూడా దంగల్ మరొక రికార్డు సృష్టించింది.