టాలీవుడ్ కి మ‌రో చేదు శుక్ర‌వారం

మరిన్ని వార్తలు

సెకండ్ వేవ్ త‌ర‌వాత థియేట‌ర్లు తెర‌చుకున్నా - టాలీవుడ్ లో వ‌సూళ్ల జోరు ఏమాత్రం క‌నిపించ‌లేదు. ఈమ‌ధ్య కాలంలో దాదాపు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే `ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ‌మండ‌పం` తప్ప ఏదీ ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌లేదు. ఈ సినిమాకే లాభాలొచ్చాయి. మిగిలిన‌వ‌న్నీ ఫ‌ట్టే. గ‌త శుక్ర‌వారం `101 జిల్లాల అంద‌గాడు`, `డియ‌ర్ మేఘ‌` విడుద‌ల‌య్యాయి. రెంటికీ రివ్యూలు అంతంత మాత్ర‌మే. వ‌సూళ్లది కూడా అదే ప‌రిస్థితి.

 

ఈ రెండు సినిమాల‌కూ ఘోర‌మైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఒక్క‌టంటే ఒక్క సినిమాకీ జ‌నం లేరు. క‌నీసం ప‌బ్లిసిటీ ఖ‌ర్చులైనా వ‌స్తాయా అన్న‌ది అనుమాన‌మే. ఈ రెండు సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు అయ్యే డిజిట‌ల్‌, క‌రెంట్ ఖ‌ర్చులు కూడా క‌రువ‌య్యాయ‌ని ఎగ్జిబీట‌ర్లు బాధ ప‌డుతున్నార్ట‌. గ‌త రెండు మూడు వారాల నుంచీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈవారం `సిటీమార్‌` సినిమా వ‌స్తోంది. అదైనా వ‌సూళ్లని రాబ‌ట్టాలి. లేదంటే... థియేట‌ర్లో సినిమా విడుద‌ల అంటే వ‌ణికిపోయే ప్ర‌మాదం ఉంది. ఆ త‌ర‌వాత‌.. ఆయా సినిమాల‌న్నీ ఓటీటీల‌కు వ‌రుస క‌ట్ట‌క త‌ప్ప‌దు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS