అనుష్క శర్మ-విరాట్ కోహ్లి ల పెళ్ళి వేడుక ఇటలీలో 11న జరిగింది. ఇక ఈ కొత్త జంటకి దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అయితే అందులో ఒకటి మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోనుంది అని ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.
అంతటి స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే- దీపిక పడుకునే-రన్వీర్ సింగ్ లు కలిసి స్పెషల్ గా చేసిన ఒక ఫ్లవర్ బోకే తో పాటుగా వాళ్ళు ఇద్దరు రాసిన ఒక స్పెషల్ విష్ ని జత చేసి ముంబైలోని అనుష్క ఇంటికి పంపించారట. ఈ స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే- ఫిలిం ఇండస్ట్రీ లో అనుష్క శర్మ కి దీపిక పడుకునేకి మొదటినుండి స్నేహం లేదు అని ఒకరిపైన ఒకరు కామెంట్స్ చేసుకున్న సందర్భాలు గతంలో ఉండడంతో ఇప్పుడు దీపిక పంపిన గిఫ్ట్ ప్రత్యేకత సంతరించుకుంది.
ఇక హనీమూన్ నుండి తరిగి వచ్చాకనే అనుష్క శర్మ ఈ గిఫ్ట్ చూడనుండి. చూసిన తరువాత తన ప్రతిస్పందన ఎలా ఉండనుంది అనే దాని పైన ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.