మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా 'దేవర' సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజయ్యింది. ఎన్టీఆర్ ఫాన్స్ ని తెగ మెప్పిస్తోంది. కొరటాల మార్క్ యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్, మెసేజ్ అన్ని ఉండటంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతే కాక దేవర లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేసి డబుల్ ట్రీట్ ఇచ్చాడు. జనరల్ గా రాజమౌళితో చేసిన తరవాత ఏ హీరోకైనా భారీ డిజాస్టర్ తప్పదు అన్న అపవాదుని 'దేవర' బ్రేక్ చేసాడు. RRR తరవాత ఎన్టీఆర్ కి సోలోగా సూపర్ హిట్ దక్కింది. దేవర కలెక్షన్స్ కూడా భారీ గానే ఉన్నాయి. దేవర ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. వీకెండ్ లో కలక్షన్స్ జోరు పెరిగి మొత్తం ఈ మూడు రోజులకి రూ.304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
దేవర రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు 61 కోట్లు కలక్ట్ చేసినట్లు సమాచారం. మొదటి రోజు కలక్షన్స్ కంటే సగానికి పడిపోయాయి. దేవర మూవీ 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే 360 కోట్లకు పైగా వసూలు చేయాలి. ఇంకో రూ. 60 కోట్లు కలెక్ట్ చేస్తే దేవర బ్రేక్ ఈవెన్ అవుతుంది. దసరా సెలవులున్న నేపథ్యంలో కలక్షన్స్ ఇంకా పెరగొచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దేవర మూడు రోజులకి రూ.112.55 కోట్లు వసూలు చేసింది.
దేవర తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ప్రాంతాలవారీగా చూస్తే నైజాం 6.78 కోట్లు, సీడెడ్ 3.96 కోట్లు, వైజాగ్ రూ.1.96 కోట్లు, ఈస్ట్ రూ. 1.06 కోట్లు, వెస్ట్ రూ. 0.62 కోట్లు, కృష్ణ రూ.1.24 కోట్లు, గుంటూరు రూ.1.04 కోట్లు, నెల్లూరు రూ. 0.70 కోట్లు, టోటల్ గా మూడో రోజు రూ. 17.36 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రల్లో దేవర మూడు రోజుల వసూళ్లు నైజాం 33.04, సీడెడ్ 18.13, వైజాగ్ 9.11, ఈస్ట్ 5.94, వెస్ట్ 4.70, కృష్ణ 5.21, గుంటూరు 8.13, నెల్లూరు 3.43 టోటల్ గా 87.69 కోట్లు వచ్చాయి.