ప్రమోషన్స్ లో దేవర జోరు

మరిన్ని వార్తలు

సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ కావటంతో టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాలకి సుడిగాలి పర్యటనలు చేస్తూ, అన్ని మీడియాలకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇంకో వైపు అడ్వాన్స్ బుకింగ్స్ సందడి కూడా మొదలైంది. ప్రీమియర్ షో పండగ, సెకండ్ ట్రైలర్ రిలీజ్, ఆయుధ పూజ సాంగ్ మొదలైన అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే గ్రాండ్ గా ముంబయి లో ప్రమోషన్స్ నిర్వహించారు మేకర్స్. దేవరలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ, హీరో సైఫ్ ఆలీఖాన్ కూడా నటిస్తుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కరణ్ జోహార్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. 


కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందించటంతో తమిళ మార్కెట్ బానే ఉంది. కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దుల్కర్ సల్మాన్ దక్కించుకున్నారు. 'వేఫేరర్ ఫిలింస్' మంచి పేరున్న సంస్థ కావటంతో కేరళ మార్కెట్ లో దేవరకి జోష్ వచ్చింది. వరుసగా ఒక్కో రాష్ట్రంలో ప్రమోషన్ చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు చండీఘర్ వెళ్తున్నారు. RRR మూవీతో ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు చండీఘర్ ఆడియన్స్ తో ఎన్టీఆర్ చిట్ చాట్ చేయనున్నారు.  


చాలా రోజులుగా దేవర నుంచి ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ అంటూ ఊరిస్తూనే ఉన్నారు. ఆయుధ పూజ సాంగ్ పై భారీ అంచనాలు పెంచారు రామ జోగయ్య శాస్త్రి. దానితో ప్రేక్షకులు ఆయుధ పూజ పాట కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయుధ పూజ సాంగ్ 19 ఉదయం రిలీజ్ చేస్తామని చెప్పి వాయిదా వేశారు. ఇప్పటికి మూడు పాటలు రిలీజ్ అవగా మూడు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఆయుధ పూజ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 


ఇవన్నీ కాకుండా దేవర మ్యూజికల్ నైట్స్ కూడా అనౌన్స్ చేసింది. ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, వైజాగ్ సిటీల్లో దేవర మ్యూజికల్ నైట్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22 ఆదివారం రాత్రి దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ అన్ని సిద్ధం చేశారు. ఈ లోగా సెకండ్ ట్రైలర్ రిలీజ్ కి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ ని పెంచింది. సెకండ్ ట్రైలర్ తో ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుందని మేకర్స్ ఆలోచన. ఈ ట్రైలర్ నిడివి వన్ మినిట్ ఉంటుందని టాక్. 


ఇంత బిజీ షెడ్యూల్ ముగించుకుని ఎన్టీఆర్ సెప్టెంబర్ 26 న లాస్ ఏంజిల్స్ వెళ్తున్నారు. కారణం దేవర షో సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఆరున్నర గంటలకు బియాండ్‌ ఫెస్ట్‌లో హాలీవుడ్‌, లాస్‌ ఏంజిల్స్‌లోని ఐకానిక్‌ ఈజిప్షియన్‌ థియేటర్‌లో ప్రదర్శిస్తుండటమే . బియాండ్‌ ఫెస్ట్‌ లో ప్రీమియర్‌ కాబోతున్న మొదటి ఇండియన్ సినిమా దేవర కావటం విశేషం. ఈ వెంట్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS