ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

By Gowthami - May 26, 2020 - 09:20 AM IST

మరిన్ని వార్తలు

దిల్ రాజు ప‌రిస్థితి ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డింది. ముందు నుయ్యి. వెనుక గొయ్యిలా మారింది వ్య‌వ‌హారం. ఇదంతా `వి` సినిమా వ‌ల్లే. దిల్ రాజు నిర్మాత‌గా తెర‌కెక్కిన చిత్రం `వి`. నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా న‌టించారు. ఇంద్ర గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌కుడు. ఉగాదికి రావాల్సిన సినిమా ఇది. కానీ లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే ఓ టీ టీ నుంచి ఈ సినిమాకి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇది వ‌ర‌కే ఈ సినిమాని ఓ టీ టీకి అమ్ముతార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే ఇంద్ర‌గంటి, నాని అందుకు ఒప్పుకోలేద‌ట‌. అయితే ఇప్పుడు వాళ్ల నుంచి కూడా గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చేసింది. కానీ.. ఇప్ప‌టికీ ఓ టీ టీకి ఇవ్వ‌లేని ప‌రిస్థితి. దానికి కార‌ణం థియేట‌ర్ యాజ‌మానులే. ముందు నుంచీ ఎగ్జిబ్యూట‌ర్స్ ప్రోత్స‌హంతో ఎదిగాడు దిల్ రాజు. దిల్ రాజు విజ‌యంలో వాళ్ల స‌హ‌కారం మ‌ర్చిపోలేనిది. సినిమాల్ని థియేట‌ర్ల‌కు కాకుండా ఓ టీ టీకి అమ్మితే.. థియేట‌ర్ యాజ‌మానుల నుంచి విమ‌ర్శ‌లు రావొచ్చు. రేప‌టి త‌న సినిమాల‌కు ఆటంకం ఏర్ప‌డ‌వ చ్చు. ఇప్పుడు దిల్ రాజు ని ఆ భ‌య‌మే ప‌ట్టుకుంది. ఓ టీ టీకి మంచి ఆఫ‌ర్ ఉన్నా.. దిల్ రాజు అమ్ముకోలేక‌పోతున్నాడు. ఒక‌వేళ థియేట‌ర్ల రీ ఓపెనింగ్ అంత‌కంత‌కూ లేట్ అయితే గ‌నుక‌.. అప్పుడు ఓ టీటీనే శ‌ర‌ణ్యం. అందుకే ఇంకొన్నాళ్లు వేచి చూడాల‌ని దిల్ రాజు భావిస్తున్నాడ‌ట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS