దిల్ రాజు మంచి నిర్మాతే కాదు. డిస్ట్రిబ్యూటర్ కూడా. తన ప్రయాణం.. అక్కడి నుంచే మొదలైంది. సినిమాలు తీస్తూ. కొంటూ.. రెండు వైపుల నుంచీ డబ్బులు సంపాదిస్తుంటాడు. దిల్ రాజు ఓ సినిమా కొన్నాడంటే అది ఆల్మోస్ట్ హిట్టే అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల నమ్మకం. అఖండ సినిమాని ఆయనే కొన్నాడు. నైజాం, ఉత్తరాంధ్ర రెండు ఏరియాలు కలిపి 17 కోట్లకు కొనేశాడు. ఇప్పుడు తనపై కాసుల వర్షం కురుస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 2 న విడులైంది. తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ నైజాంలో ఈ సినిమా 12 కోట్లు వచ్చాయి. ఫైనల్ రన్ లో దాదాపు 17 కోట్లు రాబట్టడం ఖాయం. అంటే.. రెండు ఏరియాల డబ్బూ, ఒకేచోట సంపాదించేసినట్టే. ఉత్తరాంధ్రలో ఎంతొచ్చినా లాభమే. ఉత్తరాంధ్ర నుంచి కనీసం 5 నుంచి 6 కోట్ల వరకూ వస్తుందని టాక్. అంటే... అదంతా లాభంకిందే లెక్క. సో.. దిల్ రాజు జాక్ పాట్ కొట్టేసినట్టే.