DJ కలెక్షన్స్ కి సంబంధించి ఆ చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు నోరు విప్పారు.
ఆయన తాజాగా నిర్మించిన ఫిదా చిత్ర ప్రోమోషన్స్ లో భాగంగా విలేఖరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనే విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమధానం చెబుతూ- మేము విడుదల చేసిన కలెక్షన్ ఫిగర్స్ 100 శాతం కరెక్ట్ అని, తాను నిర్మతనే కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ ని కూడా అని. తప్పుడు కలెక్షన్స్ ప్రకటిస్తే అది తన బిజినెస్ కి పర్సనల్ గా తనకి చెడ్డ పేరు అని చెప్పాడు.
ఇక బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సరైనోడు కలెక్షన్స్ ని DJ చిత్ర కలెక్షన్స్ దాటినప్పుడు దానిని సూపర్ హిట్ గానే భావించాలి అని స్పష్టం చేశాడు.
అయితే ఈ కలెక్షన్స్ విషయం పైన కాంట్రవర్సీ రావడానికి కారణాలు నాకు తెలియదు అని తెలిపాడు.