మలయాళ నటుడు దిలీప్ గురించిన సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.
ప్రస్తుతం పోలీసు కస్టడీ లో ఉన్న ఆయనను ప్రశ్నించగా, నటి భావన పైన ఉన్న కోపమే ఇంతటి దారుణాన్ని ప్రోత్సహించే వరకు వెళ్ళింది అని తెలుస్తున్నది. ఆ క్రమంలోనే ఓ వ్యక్తికి రూ. 1.5 కోట్లు ఇచ్చి భావనపై దాడి చేసి దాన్ని వీడియోలో రికార్డు చేయాలని, అలాగే ఆమెను నగ్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆమె పరువుని బజారుకి ఈడ్చాలని బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఇక ఈ సంఘటనల దృష్ట్యా, దిలీప్ ని మలయాళ చిత్ర పరిశ్రమ సంఘం నుండి బహిష్కరిస్తూ, అలాగే ఆయన నిర్వహిస్తున్న కోశాదికారి పదవి నుండి తొలగించడం జరిగింది.
ఇప్పటికీ కేరళనాట దిలీప్ ఇంతటి నేరానికి పాల్పడినట్టు జనాలు నమ్మలేకపొతున్నారు.